ఎదురులేని సింధు.. జపాన్ స్టార్ యమగుచి చిత్తు!
- గ్రూప్-ఎలో అగ్రస్థానంలో సింధు
- చెన్ యుఫీతో నేడు సెమీస్ పోరు
- గెలిస్తే సింధు ఖాతాలో మరో పతకం
తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న సింధుకు రెండో సెట్లో కొంత ప్రతిఘటన ఎదురైంది. అయినప్పటికీ సింధు షాట్ల ముందు యమగుచి తలవంచక తప్పలేదు. ఈ విజయంతో గ్రూప్ దశను ముగించిన సింధు గ్రూప్-ఎలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. నేడు జరగనున్న సెమీస్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫీతో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సింధు ఖాతాలో మరో పతకం చేరుతుంది.