రాణి 'పద్మావతి'పై మరో కొత్త సినిమా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాణి 'పద్మావతి'పై మరో కొత్త సినిమా!

  • దీపిక న‌టించిన ‘పద్మావతి’పై ఓవైపు దుమారం
  • మ‌రోవైపు ‘మై హూ పద్మావతి’ సినిమా స్క్రిప్ట్ రెడీ
  • తాము తీసే సినిమాలో నిజాల‌ను చూపిస్తామ‌న్న నిర్మాత‌
రాణి ప‌ద్మావ‌తి జీవిత క‌థ ఆధారంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకునే న‌టించిన ‘పద్మావతి’ సినిమాపై ఎంత‌టి దుమారం చెల‌రేగుతుందో తెలిసిందే. ఆ సినిమా విడుద‌లైతే విధ్వంసం త‌ప్ప‌ద‌ని రాజ్‌పుత్ సేన‌లు తీవ్రంగా హెచ్చ‌రిక‌లు చేశారు. ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందో కూడా ఇంత‌వ‌ర‌కు స్ప‌ష్ట‌త రాలేదు. అయితే, పద్మావతి జీవితాధారంగా మరో సినిమాను తీయ‌నున్నారు.

‘మై హూ పద్మావతి’ (నేనే ప‌ద్మావ‌తి) అనే టైటిల్‌తో అశోక్‌ శేఖర్ ఈ సినిమాని నిర్మించ‌నున్నారు. ఇందుకోసం స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. తాజాగా అశోక్‌ శేఖర్ మాట్లాడుతూ 'పద్మావతి' సినిమాలో అవాస్తవాలు చూపించార‌ని, తాము తీయబోయే 'మై హూ పద్మావతి' సినిమాలో నిజాన్ని చూపిస్తామ‌ని ఉద్ఘాటించారు.      
deepika padukune
cinema
rajputh

More Telugu News