'అమెరికాలో సూపర్‌మ్యాన్... భారత్‌లో ప్యాడ్ మ్యాన్' అంటున్న అక్షయ్ కుమార్
- ఆలోచింపజేస్తున్న 'ప్యాడ్ మ్యాన్' ట్రైలర్
- వాయిస్ ఓవర్ ఇచ్చిన బిగ్ బీ
- జనవరి 26న విడుదల
ఆర్. బాల్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా ఆప్టే, సోనమ్ కపూర్లు నటించారు. ఈ చిత్ర ట్రైలర్లో ‘అమెరికాలో సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఉన్నారు. కానీ మన భారత్‌లో ప్యాడ్‌మ్యాన్ ఉన్నాడు’ అనే డైలాగ్ ఆలోచింపజేస్తోంది. అలాగే ఈ ట్రైలర్‌కి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇచ్చిన వాయిస్ ఓవర్ హైలైట్‌గా నిలిచింది. మహిళలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని వచ్చీ రాని ఆంగ్లంలో అక్షయ్ కుమార్ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రాన్ని అరుణాచలం మురుగనాథమ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. తమిళనాడుకి చెందిన అరుణాచలం మురుగనాథమ్, సమాజంలో మహిళలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు శానిటరీ ప్యాడ్లు తయారుచేసి తక్కువ ధరకు లభించేలా కృషిచేశారు. ఈ చిత్రం 2018 జనవరి 26న విడుదలకానుంది.