కోలారులో దారుణం.. వానరాల సామూహిక హత్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోలారులో దారుణం.. వానరాల సామూహిక హత్య!

  • పెద్ద ఎత్తున కోతులను చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు
  • మృతదేహాలను కొండపై పడేసిన వైనం
  • స్థానికులు చూడడంతో వెలుగులోకి
కర్ణాటకలోని కోలారులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు 30కిపైగా కోతులను చంపేసి వాటిని సంచుల్లో నింపి ఓ చోట పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగు  చూసింది. కట్టి శ్రీనివాసపురం తాలూకాలోని యర్రకొండ గ్రామస్థుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు 30కిపైగా కోతులను చంపేశారు. అనంతరం వాటి మృతదేహాలను ఓ సంచిలో వేసుకొచ్చి యర్రకొండ పర్వతప్రాంతంలోని ఓ చోట పడేశారు.

కొండపైకి వెళ్లిన స్థానికులు వీటిని చూడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విషయాన్ని పోలీసులు, అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో వారొచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోతులను ఎవరు చంపారు? ఎందుకు చంపారన్న దానిపై వివరాలు రాబడుతున్నారు. కాగా, వానరాలను చంపి పడేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Monkey
Karnataka
Kolar

More Telugu News