Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఉమామాధ‌వ‌రెడ్డి.. కొనియాడిన కేసీఆర్‌

  • టీఆర్ఎస్‌లోకి ఉమామాధవరెడ్డితో పాటు ఆమె కుమారుడు సందీప్‌ రెడ్డి
  • వారికి మంచి భ‌విష్య‌త్తు ఉంది-కేసీఆర్‌
  • టీఆర్ఎస్‌లో చేరేందుకు ఎటువంటి కండిష‌న్లూ పెట్టలేదు
  • ఉమామాధ‌వ‌రెడ్డి నా సోద‌రిలాంటి వ్య‌క్తి
నల్గొండ‌ జిల్లా సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డితో పాటు ఆమె కుమారుడు సందీప్‌ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ రోజు వారు తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఉమామాధ‌వ‌రెడ్డి, సందీప్ రెడ్డికి మంచి భ‌విష్య‌త్తు ఉందని అన్నారు.

న‌ల్గొండ జిల్లా నుంచి చాలా మంది టీఆర్ఎస్‌లో చేరార‌ని కేసీఆర్‌ తెలిపారు. టీఆర్ఎస్‌లో చేరేందుకు ఉమామాధ‌వ‌రెడ్డి ఎటువంటి కండిష‌న్లు పెట్టలేద‌ని అన్నారు. ఉమామాధ‌వ‌రెడ్డి త‌న‌ సొంత సోద‌రి వంటి వారని తెలిపారు. వారిది ఎంతో సంస్కారం, గొప్ప మ‌న‌సు ఉన్న కుటుంబమ‌ని వ్యాఖ్యానించారు.
TRS
KCR
uma madava reddy

More Telugu News