ఈ ఏడాది టీమిండియా ప్రదర్శన అదుర్స్: ఎమ్మెస్కే ప్రసాద్
- ఈ ఏడాది టీమిండియా గొప్ప విజయాలు సాధించింది
- అన్ని ఫార్మాట్లలోనూ రాణించింది
- వచ్చే ఏడాది కూడా రాణిస్తే మరో ఐదేళ్లు తిరుగుండదు
- రోహిత్ శర్మ మూడుసార్లు ద్విశతకాలు చేయడం అద్భుతం
విజయవాడలో ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఏడాది కూడా ఇటువంటి ఆటతీరే కనబరిస్తే మరో ఐదేళ్ల పాటు భారత్ క్రికెట్కు తిరుగుండదని అన్నారు. శ్రీలంకతో జరిగిన తొలివన్డేలో రెండు పరుగులకే ఔటైన రోహిత్ శర్మ నిన్నటి వన్డేలో మాత్రం ద్విశతకం చేయడం అభినందనీయమని చెప్పారు. వన్డేలో ఒక ద్విశతకం సాధించడమే అరుదయితే, రోహిత్ శర్మ మాత్రం
మూడుసార్లు ద్విశతకాలు చేయడం అద్భుతమని ప్రశంసించారు.