వరుసగా ఆరో రోజు కూడా పడిపోయిన బంగారం ధర!
- నేడు రూ.180 పడిపోయిన పసిడి ధర
- 10 గ్రాములకు రూ.29,400గా నమోదు
- వెండి ధర కేజీకి రూ.37,775
ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.29,400గా ఉండగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.29,250గా ఉంది. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర 0.54 శాతం తగ్గి, ఒక్కో ఔన్స్‌కు 1,241.40 డాలర్లకు చేరింది. మరోవైపు వెండి కూడా రూ.25 తగ్గి, కేజీకి రూ.37,775కి చేరింది.