సైకిల్‌పై వెళుతోన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. కొత్త పోస్ట‌ర్‌.. 'అజ్ఞాత‌వాసి' టీజ‌ర్ రిలీజ్ తేదీ ఖ‌రారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైకిల్‌పై వెళుతోన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. కొత్త పోస్ట‌ర్‌.. 'అజ్ఞాత‌వాసి' టీజ‌ర్ రిలీజ్ తేదీ ఖ‌రారు!

  • పీకే క్రియేటివ్ వ‌ర్క్స్ ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌న్ కొత్త లుక్ విడుద‌ల‌
  • ఈ నెల 16న విడుద‌ల కానున్న టీజ‌ర్‌
  • త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో అజ్ఞాత‌వాసి
సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులకు శుభ‌వార్త‌. ప‌వ‌న్ క‌ల్యాణ్, త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న 'అజ్ఞాత‌వాసి' సినిమా టీజ‌ర్ విడుద‌ల‌ తేదీ ఖరారైంది. పీకే క్రియేటివ్ వ‌ర్క్స్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ సైకిల్‌పై బ‌య‌లుదేరుతున్న‌ట్లు కొత్త లుక్ ను చూపించారు.

ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 16న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సినిమాను జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విష‌యం తెలిసిందే. త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో ఇంత‌కు ముందు వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు మంచి విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో అజ్ఞాత‌వాసి సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. 
Pawan Kalyan
trivikaram
cinema

More Telugu News