తమిళనాడులో దళితుడి హత్య కేసు.. ఆరుగురికి మరణశిక్ష!
- 2016లో తమిళనాడులో పరువు హత్య
- 11 మందిపై కేసు నమోదు
- ఆరుగురికి మరణశిక్ష.. ఇద్దరికి జైలు శిక్ష
ఈ హత్య ఉదంతాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం కేసు విచారణ కోసం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా నియమించింది. తిరుపూర్ సెషన్స్ కోర్టులో నవంబర్ లో కేసు విచారణ పూర్తయింది. తుది తీర్పును ఈరోజు కోర్టు వెలువరించింది. మొత్తం ఆరుగురికి మరణశిక్షను విధించింది. ఇందులో శంకర్ మామ కూడా ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఒకరికి జీవితఖైదును, మరొకరికి మూడేళ్ల శిక్షను విధించింది. మిగిలిన ముగ్గురుని నిర్దోషులుగా విడుదల చేసింది. నిర్దోషిగా విడుదలైన వారిలో కౌశల్య తల్లి కూడా ఉంది. న్యాయమూర్తి నటరాజన్ ఈ తీర్పును వెలువరించారు.