62 అంతస్తుల భవనం మీద స్టంట్... పట్టుదప్పి దుర్మరణం.. వీడియో చూడండి!
- చైనాలో జరిగిన ఘోరం
- వైరల్ అవుతున్న వీడియో
- గతంలో ఎన్నో స్టంట్స్ చేసిన వూ వాంగ్‌నింగ్
అయితే ఈ స్టంట్స్ చేసేముందు వూ వాంగ్‌నింగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. ఇటీవల హునాన్ ప్రావిన్స్‌లోని ఓ 62 అంతస్తుల భవనం పైనుంచి ఎక్సర్సైజ్ స్టంట్ చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. చేతులు పట్టుదప్పడంతో వూ వాంగ్‌నింగ్ కిందపడి మరణించాడు. అతను జారిపడింది వీడియోలో రికార్డయింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ స్టంట్ ద్వారా వచ్చే డబ్బును వూ తన పెళ్లి కోసం ఖర్చుచేయాలనుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు ఇలా జరగడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.