టైలర్‌గా మారిన బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్‌
Add ap7am to your home Screen

టైలర్‌గా మారిన బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్‌

  • 'సుయి ధాగా' చిత్రంకోసం వ‌స్త్రాలు కుట్ట‌డంలో శిక్ష‌ణ‌
  • క‌థానాయిక‌గా అనుష్క శ‌ర్మ‌
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న శ‌ర‌త్ క‌టారియా
పాత్ర‌లో ఒదిగిపోవ‌డం కోసం న‌టీన‌టులు చాలా కష్టపడుతుంటారు. అవసరమైతే క్యారెక్టర్ కోసం ఆయా వృత్తుల్లో శిక్షణ కూడా తీసుకుంటారు. ప్ర‌స్తుతం బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ కూడా అదే ప‌నిలో ఉన్నాడు. త‌న త‌ర్వాతి చిత్రం 'సుయి ధాగా' కోసం టైల‌రింగ్ నేర్చుకుంటున్నాడు. ఇందులో క‌థానాయికగా న‌టించ‌నున్న అనుష్క శ‌ర్మ పెళ్లి సంద‌ర్భంగా ఈ చిత్రంలోని వ‌రుణ్ ధావ‌న్ లుక్‌ని చిత్ర నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిలింస్ విడుద‌ల చేసింది.

కుట్టుమెషీన్ మీద క‌ష్టాలు ప‌డుతున్న‌ట్లుగా క‌నిపిస్తున్న వ‌రుణ్ ధావ‌న్‌... నిజంగా టైల‌ర్‌లాగే క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రానికి శ‌ర‌త్ క‌టారియా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో ఈయ‌న 'ధ‌మ్ ల‌గాకే హైసా' చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మేడ్ ఇన్ ఇండియా అనే క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
varun dhawan
bollywood
sui dhaaga
Anushka Sharma

More Telugu News