Virat Kohli: పెళ్లి ఫోటోలు అమ్మి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించిన విరాట్, అనుష్క!

నిన్న ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం జరుగగా, పరిమిత సంఖ్యలో మాత్రమే ఫోటోలను విడుదల చేసిన కొత్త జంట, ఎక్స్ క్లూజివ్ ఫొటోలను విక్రయించాలని నిర్ణయించింది. ఓ ప్రముఖ మేగజైన్ కు తమ పెళ్లి ఫోటోలను విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులను ఓ చారిటీ సంస్థకు ఇవ్వాలని వీరిద్దరూ నిర్ణయించారని సమాచారం.

ఇక, పెళ్లివేళ, ఐదారు ఫొటోలు, నిమిషాల వీడియో మినహా విరాట్, కోహ్లీ వివాహం గురించిన సమాచారం వెల్లడి కాలేదన్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి కొడుకును చేయడం, పెళ్లి కూతురి అలంకరణ, సంగీత్, వివాహ వేడుక, హాజరైన అతిథులు తదితర సమాచారమంతా ఉన్న వీడియో, ఫోటోలను ఎంత మొత్తానికి విక్రయించేందుకు వీరు అంగీకరించారన్న విషయం మాత్రం తెలియరాలేదు.
Virat Kohli
Anushka Sharma
Marriage
charity
Photos

More Telugu News