ఓసారి కలుద్దామన్న ఓడిశా సీఎం నవీన్ పట్నాయక్... ఓకే చెప్పిన చంద్రబాబు!
- పోలవరంపై చర్చించుకుందాం
- సమావేశానికి తెలంగాణ, చత్తీస్ గఢ్ సీఎంలు కూడా
- త్వరలో తేదీ ఖరారు
ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని ఒడిశా అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ఉదయం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కేసు విచారణను ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసిన ధర్మాసనం, ఈ లోగా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సూచించింది.