మై డియర్ రజనీ.. నీవు నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని కోరుకుంటున్నా!: మోహన్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మై డియర్ రజనీ.. నీవు నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని కోరుకుంటున్నా!: మోహన్ బాబు

  • నేడు రజినీ జన్మదినం
  • శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు
  • నిండు నూరేళ్లు బతకాలంటూ ట్వీట్
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రజనీ ఆత్మీయ మిత్రుడు మోహన్ బాబు కూడా జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు.

'హ్యాపీ బర్త్ డే టు మై డియర్ ఫ్రెండ్ రజనీ. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు. సినీ కెరీర్ ఆరంభం నుంచి కూడా వీరిద్దరూ మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిందే.

Rajinikanth

More Telugu News