అఖిల్ తోడుగా రంగంలోకి దిగిన రానా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిల్ తోడుగా రంగంలోకి దిగిన రానా!

  • 'హలో' ప్రమోషన్స్ లో అఖిల్ 
  • ఆయనతో పాటు యూఎస్ కి రానా 
  • ఆడియోకి మంచి రెస్పాన్స్ 
  • ఈ నెల 22న సినిమా రిలీజ్
'హలో' అంటూ ఆడియన్స్ ను పలకరించడానికి అఖిల్ రెడీ అవుతున్నాడు. నాగార్జున నిర్మాణంలో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా టీమ్ లో మరింతగా జోష్ పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

 ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం అఖిల్ యూఎస్ వెళ్లాడు. ప్రమోషన్స్ లో భాగంగా అక్కడ వివిధ ప్రాంతాల్లో కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రమోషన్స్ లో పాల్గొనడం అఖిల్ కి కొత్త కనుక, ఆయనతో పాటు రానాను కూడా నాగార్జున పంపించారట. అఖిల్ తో పాటు ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో రానా కూడా పాల్గొననున్నాడన్న మాట. యూఎస్ లో రానా కి మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే.     
akhil
kalyani priyadarshan

More Telugu News