హెలికాప్టర్లో వచ్చి 13 ఏళ్ల బాలికను పెళ్లాడబోయిన 56 ఏళ్ల సర్పంచ్!
- మొదటి భార్య ఉండగానే బాలికతో రెండో పెళ్లికి సిద్ధమైన సర్పంచ్
- అడ్డుకున్న కలెక్టర్.. పోలీసులకు ఫిర్యాదు
- మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన
స్థానిక మీడియా కథనం ప్రకారం.. కైలారస్ తహసీల్ బహ్రాసా సర్పంచ్ జగన్నాథ్‌కు ఇది వరకే పెళ్లయింది. భార్య ఉండగానే బాలికతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లిలో హెలికాప్టర్‌ను వినియోగించుకునేందుకు కలెక్టర్ అనుమతి కూడా తీసుకున్నాడు. అయితే ఆయనకు మొదటి భార్య ఉందని, ఇప్పుడు బాలికను పెళ్లాడబోతున్నాడని కలెక్టర్‌కు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. దీంతో హెలిప్యాడ్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన కలెక్టర్ వివాహాన్ని అడ్డుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.