Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అటువంటి వాతావ‌ర‌ణంలో నా కూతురు ఉండ‌డం నాకు ఇష్టంలేదు: సెల్ఫీ వీడియోలో విజ‌య్

  • 'వాల్ పోస్ట‌ర్' అనే సినిమా ద్వారా వ‌నిత ప‌రిచ‌య‌మైంది
  • వ‌నిత‌కు గ‌తంలో అమ్మిరెడ్డి అనే వ్య‌క్తితో పెళ్లి జ‌రిగింది
  • మా మ‌ధ్య శ‌శిధ‌ర్ ఆనే వ్యక్తి కూడా వ‌చ్చాడు
హైద‌రాబాద్‌, యూస‌ఫ్‌గూడ‌లోని త‌న నివాసంలో హాస్య‌న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. విజ‌య్ సెల్ఫీ వీడియోలో చెప్పిన మ‌రిన్ని విష‌యాలు మీడియాకు తెలిశాయి. వాల్ పోస్ట‌ర్ అనే సినిమా ద్వారా వ‌నిత త‌న‌కు ప‌రిచ‌య‌మైందని విజ‌య్ తెలిపాడు. వ‌నిత‌కు గ‌తంలో అమ్మిరెడ్డి అనే వ్య‌క్తితో పెళ్లి జ‌రిగింద‌ని చెప్పాడు. త‌మ మ‌ధ్య శ‌శిధ‌ర్ ఆనే వ్యక్తి కూడా రావ‌డంతో త‌న భార్య‌ వ‌నిత వ‌ద్ద ఆ వాతావ‌ర‌ణంలో త‌న‌ కుమార్తె పెర‌గ‌డం త‌న‌కు ఇష్టం లేదని అన్నాడు. అడ్వ‌కేట్ శ్రీనివాస్‌, శ‌శిధ‌ర్ కూడా త‌న‌ను మాన‌సికంగా వేధించారని పేర్కొన్నాడు.  
vijay
cinema actor
selfie video

More Telugu News