పిల్లల పేరున వీలునామా రాసేసి సూసైడ్ చేసుకోవాలనుకున్నా: యమున
- ఆ నిందను భరించలేకపోయాను
- సూటిపోటి మాటలను తట్టుకోలేకపోయాను
- అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను
"ఇండస్ట్రీలో కూడా నన్ను ఫైర్ బ్రాండ్ అనేవారు .. ఇంట్లోను అదే పేరు. న్యాయంగా లేకపోతే నాతో మాట్లాడి గెలవలేం అనేవారు. అంత నిజాయితీగా బతికిన నాకు సూటిపోటి మాటలు ఎదురయ్యాయి. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ల మధ్య నేను బతకాలా? నా కొద్దు ఈ లైఫ్ అనిపించింది. నా పెయిన్ ను నా పిల్లలకు ఇవ్వదల్చుకోలేదు .. నేను లేకపోతే వాళ్లు బాగుంటారు అనుకున్నాను. వాళ్ల పేరున వీలునామా రాయాలనుకుంటున్నట్టుగా నా సన్నిహితురాలికి చెప్పాను. ఆమెకి విషయం అర్థమై "ఎన్ని కష్టాలు ఎదురైనా నీ పిల్లల కోసం నువ్ బతకాల్సిందే" అంది. "ఆ మాటే నా నిర్ణయాన్ని మార్చేసింది" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.