మా వారు అలాంటి వారు కాదు: 'ద‌ంగ‌ల్' న‌టిని వేధించిన కేసులో నిందితుడి భార్య‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా వారు అలాంటి వారు కాదు: 'ద‌ంగ‌ల్' న‌టిని వేధించిన కేసులో నిందితుడి భార్య‌

  • అనుకోకుండా కాలు త‌గిలితే న‌టి ర‌చ్చ చేస్తోంది
  • ఆయ‌న చాలా అల‌సిపోయి ఉన్నారు
  • కాలు త‌గిలిన వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు
మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'దంగ‌ల్' న‌టి కేసులో నిందితుడు వికాస్ స‌చ్‌దేవ్‌కి మ‌ద్ద‌తుగా ఆయ‌న భార్య దివ్య మాట్లాడింది. వికాస్‌ కాలు అనుకోకుండా జైరా వ‌సీంకి త‌గిలింద‌ని, ఆ వెంట‌నే ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ప్ప‌టికీ న‌టి ర‌చ్చ చేస్తోంద‌ని అంది. ఢిల్లీలో బంధువు అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రై తిరిగి వ‌స్తున్న వికాస్ చాలా అల‌సిపోయి ఉన్నాడ‌ని, ఆ నిద్ర‌లో కాలు త‌గిలి ఉండొచ్చ‌ని దివ్య పేర్కొంది.

జైరా వ‌సీం కూడా కాలు త‌గిలిన వెంట‌నే స్పందించ‌కుండా... వీడియో పోస్ట్ చేసి ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని, ఆమె చేస్తున్న ఆరోప‌ణ‌లు త‌న‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించాయ‌ని దివ్య చెప్పింది. త‌న భ‌ర్త కుటుంబానికి విలువిచ్చే మ‌నిషిని, ఇలాంటి ప‌ని అస‌లు చేయ‌బోడ‌ని తెలిపింది. జైరా వ‌సీం ఆరోప‌ణ‌ల మేర‌కు వికాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.
dangal
zaira wasim
molestation

More Telugu News