వెంకటేశ్ సరసన అనుష్క కాదు .. అదితీ రావ్!

  • తేజ దర్శకత్వంలో వెంకటేశ్ 
  • తమన్నా లేదన్నట్టే .. కాజల్ కాదన్నట్టే 
  • అనుష్క అనే వార్తలోను నిజం లేదు             
తేజ దర్శకత్వంలో వెంకటేశ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత తమన్నా పేరు ఎక్కువగా వినిపించింది.

 ఈ ఇద్దరు కథానాయికలు పారితోషికం ఎక్కువగా అడగడం వలన, అనుష్కను తీసుకోనున్నట్టుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈ వార్తలో నిజం లేదనేది తాజా సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా అదితీరావును తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమెను అడగడం .. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయట. ప్రస్తుతం ఆమె సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.             
Go Back to Shorts
venkatesh
aditi rao

More Telugu News