ఎవరు చెప్పినా వినను .. నాకు నచ్చిందే చేస్తాను: యాంకర్ రవి
- మొదటి నుంచి హీరో కావాలని ఉండేది
- అటు వైపు వెళ్లడం కోసమే యాంకర్ గా మారాను
- చిన్న సినిమాల్లో హీరోగా చేయాలని నిర్ణయించుకున్నాను
- నటన తప్ప నాకు మరేమీ తెలియదు
" ఆ పాత్రలు అంగీకరిస్తే అలాంటివే వస్తుంటాయి కనుక .. చేయదలచుకోలేదు. చిన్న సినిమాల్లో హీరోగానే చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రయాణంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని భావిస్తున్నాను. నాపై నాకు నమ్మకం ఎక్కువ .. ఎవరు చెప్పినా వినిపించుకోను .. నాకు ఏది నచ్చితే అదే చేస్తాను. ఒకవేళ పొరపాట్లు జరిగితే వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగుతాను. ఎన్ని కష్టాలు పడినా .. ఎవరెంతగా విమర్శించినా నాకు తెలిసింది ఇదే .. అందువలన ఇదే మార్గంలో కొనసాగుతాను" అంటూ చెప్పుకొచ్చాడు.