విమానంలో 'దంగల్' నటిని వేధించింది ముంబై వ్యాపారవేత్త... అరెస్ట్

  • విమానంలో జైరాను వేధించిన వికాస్ సచ్ దేవ్
  • న్యూఢిల్లీలో అరెస్ట్ - నేడు కోర్టు ముందుకు
  • పోస్కో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు
అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 'దంగల్' చిత్ర నటి జైరా వాసిమ్, విస్తారా విమానంలో ప్రయాణిస్తున్న వేళ, ఆమెను వేధించిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అతను 39 సంవత్సరాల ముంబై వ్యాపారవేత్త వికాస్ సచ్ దేవ్ అని, బాధితురాలి వయసు 17 సంవత్సరాలే కావడంతో, పోస్కో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) సహా పలు సెక్షన్లపై కేసు పెట్టినట్టు న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుంభారే వెల్లడించారు. ఆయన్ను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.

కాగా, విమానంలో తన సీటు హ్యాండ్ రెస్ట్ పై వెనక కూర్చున్న వ్యక్తి కాలు పెట్టాడని, మెడ, చేతులు, వీపుపై అసభ్యంగా తాకాడని జైరా వాసిమ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఏడుస్తూ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. విషయాన్ని ఫ్లయిట్ క్రూ దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని ఆరోపించింది. జరిగిన ఘటనపై విస్తారా సైతం స్పందించింది. ఈ తరహా సంఘటనలను తాము ప్రోత్సహించబోమని, విచారణలో జైరాకు పూర్తి సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది.
Go Back to Shorts
Jaira
Vistara
Dangal
Molestation
Harrasment

More Telugu News