విమానంలో 'దంగల్' నటిని వేధించింది ముంబై వ్యాపారవేత్త... అరెస్ట్
- విమానంలో జైరాను వేధించిన వికాస్ సచ్ దేవ్
- న్యూఢిల్లీలో అరెస్ట్ - నేడు కోర్టు ముందుకు
- పోస్కో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు
కాగా, విమానంలో తన సీటు హ్యాండ్ రెస్ట్ పై వెనక కూర్చున్న వ్యక్తి కాలు పెట్టాడని, మెడ, చేతులు, వీపుపై అసభ్యంగా తాకాడని జైరా వాసిమ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఏడుస్తూ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. విషయాన్ని ఫ్లయిట్ క్రూ దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని ఆరోపించింది. జరిగిన ఘటనపై విస్తారా సైతం స్పందించింది. ఈ తరహా సంఘటనలను తాము ప్రోత్సహించబోమని, విచారణలో జైరాకు పూర్తి సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది.