పక్కా పంజాబీ సంప్రదాయంలో కోహ్లీ-అనుష్కల వివాహం.. చురుగ్గా ఏర్పాట్లు!

  • ఇటలీలోని టస్కనీలో రేపే వివాహం
  • సచిన్, యువరాజ్ సహా నగరానికి చేరుకుంటున్న ప్రముఖులు
  • 26న ముంబైలో రిసెప్షన్
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ-అనుష్కల వివాహానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇటలీలోని టస్కనీ నగరంలో జరగనున్న ఈ పెళ్లి కోసం ఇప్పటికే ప్రముఖులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ‘విరుష్క’ పెళ్లి పక్కా పంజాబీ సంప్రదాయంలో జరగనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం భాంగ్రా నృత్యకారులు, డ్రమ్ములు ఇప్పటికే టస్కనీకి చేరుకున్నట్టు సమాచారం.

టస్కనీలోని హెరిటేజ్ ప్యాలెస్‌లో అతి కొద్దిమంది సమక్షంలో జరగనున్న ఈ పెళ్లికి సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌లు హాజరవుతున్నారు. కోహ్లీ తన వివాహ విషయాన్ని మొదట సచిన్‌కు చెప్పి ఆహ్వానించగా, అనుష్క తన తొలి సినిమా నిర్మాత అయిన బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య చోప్రాకు తెలిపింది. ఆదిత్య, నటి రాణీముఖర్జీ వివాహం కూడా ఇటలీలోనే జరిగిన సంగతి తెలిసిందే. ఈనెల 26న ముంబైలో కోహ్లీ వివాహ రిసెప్షన్ ను  ఏర్పాటు చేసినట్టు సమాచారం. గత వారం రోజులుగా హల్‌చల్ చేస్తున్న కోహ్లీ-అనుష్క శర్మల వివాహ వార్తలకు రేపటితో చెక్ పడనుంది.
Go Back to Shorts
Virat Kohli
Anushka Sharma
Marriage

More Telugu News