నటి జైరా వాసిమ్ ఆవేదనపై స్పందించిన విస్తారా!
- తననో వ్యక్తి లైంగికంగా వేధించాడన్న జైరా
- దర్యాఫ్తు జరుపుతున్నామని ప్రకటించిన విస్తారా
- ఇటువంటి ప్రవర్తన సహించబోమని వెల్లడి
"నిన్న రాత్రి ఒక ప్రయాణికుడితో జైరా వాసిమ్ ఎదుర్కొన్న పరిస్థితి గురించి గమనించాం. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నాం, జైరాకు మద్దతిస్తాం. ఇలాంటి ప్రవర్తనను మేం సహించబోము" అని పేర్కొంది. కాగా, ఇన్ స్టాగ్రామ్ లో జైరా పెట్టిన పోస్టు వైరల్ అవుతుండగా, ఆమెకు అండగా నిలుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.