Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంగ్లిష్ దినప‌త్రికపై మండిప‌డ్డ‌ సినీన‌టుడు సిద్ధార్థ్!

  • '2.ఓ' సినిమాలో సిద్ధార్థ్ హీరో అని పేర్కొన్న ఇండియా టుడే
  • సిద్ధార్థ్ ట్విట్ట‌ర్ ఎకౌంట్ హ్యాక్ అయింద‌ని వార్త‌
  • ఆయ‌న ఖాతాలో త‌ప్పుడు పోస్ట్‌లు వ‌స్తున్నాయ‌ని ప్ర‌చారం
ఓ ఇంగ్లిష్ దినప‌త్రికపై సినీన‌టుడు సిద్ధార్థ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న '2.ఓ' సినిమాలో రజనీకాంత్ హీరోగా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, ఇండియా టుడే ప‌త్రిక '2.ఓ చిత్ర హీరో సిద్ధార్థ్ ట్విట్ట‌ర్ ఎకౌంట్ హ్యాక్ అయింది' అంటూ వార్త రాసింది. అంతేకాకుండా, ప్ర‌స్తుతం ఆయ‌న ఖాతాలో త‌ప్పుడు పోస్ట్‌లు వ‌స్తున్నాయ‌ని, సిద్ధార్థ్ సినిమా 2.ఓ కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింద‌ని ఆ ప‌త్రిక పేర్కొంది.

ఈ విష‌యంపై స్పందించిన సిద్ధార్థ్.. 2.ఓ సినిమాలో తాను హీరోన‌ని ఆ ప‌త్రిక పేర్కొన‌డం ప‌ట్ల చుర‌క‌లంటించారు. భార‌త‌ జర్నలిజం పీక్స్‌లో ఉందని, గర్వించదగిన స‌మ‌య‌మ‌ని పేర్కొన్నాడు. 2.ఓ సినిమా త‌న‌ది కాదని, అది ఓ లెజెండ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అని, అందులో పెద్ద హీరో నటిస్తున్నార‌ని స్ప‌ష్ట‌తనిచ్చారు. దీంతో ఇండియా టుడే తాము చేసిన తప్పుని స‌రిదిద్దుకుంది. 
sidharth
english news paper
fire

More Telugu News