Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూట్యూబ్ వీడియో కోసం ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తి... వీడియో చూడండి!

  • మైక్రోవేవ్‌లో సిమెంట్ వేసి త‌ల‌ దూర్చిన యూట్యూబ‌ర్‌
  • గంట శ్ర‌మ‌ప‌డి బ‌య‌టికి తీసిన పోలీసు సిబ్బంది
  • ప్రాణాల‌తో చెల‌గాటం ఆడే వీడియోలు చేసే జే స్వింగ్ల‌ర్‌
యూట్యూబ్‌లో లైకులు, షేర్లు, హిట్ల ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది డ‌బ్బు సంపాదిస్తున్నారు. విభిన్నంగా ఉండే వీడియోలు పెట్టిన వారికి ఎక్కువ ప్ర‌జాద‌ర‌ణ ఉంటోంది. అలాంటి వ్యక్తే లండ‌న్‌కి చెందిన జే స్వింగ్ల‌ర్‌. ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతూ రూపొందించిన వీడియోల‌ను జే యూట్యూబ్‌లో పెడుతుంటాడు. కానీ ఇటీవ‌ల ఓ వీడియో చేస్తుండ‌గా నిజంగానే అత‌ని ప్రాణాల మీదికి వ‌చ్చింది.

మైక్రోవేవ్‌ ఓవెన్ లో పాలీ ఫిల్లా అనే సిమెంట్ వేసి, త‌ల‌కు గాలిపైపు త‌గిలించిన‌ పాలిథీన్ క‌వ‌ర్ పెట్టుకుని అందులో దూర్చాడు. సిమెంట్ గ‌ట్టిప‌డ‌టం కోసం బ‌య‌టి నుంచి హెయిర్ డ్ర‌య్య‌ర్‌ను ఉప‌యోగించారు. ప‌ది నిమిషాల త‌ర్వాత సిమెంట్ గ‌ట్టిప‌డింది. లోప‌ల ఉన్న జే స్వింగ్ల‌ర్‌కి గాలి ఆడ‌లేదు. స్నేహితులు ప్ర‌య‌త్నించినా మైక్రోవేవ్‌ను తీయ‌లేక‌పోయారు. దీంతో అత్య‌వ‌స‌ర పోలీసు సిబ్బందికి ఫోన్ చేశారు. వారు వ‌చ్చి గంటసేపు క‌ష్ట‌ప‌డి జే స్వింగ్ల‌ర్ త‌ల మీది నుంచి మైక్రోవేవ్‌ను తొల‌గించారు.

yoyutbe
jay swingler
england
dangerous

More Telugu News