మేగ‌జైన్ ముఖ‌చిత్రంలో ఉన్న ఆ చేయి ఎవ‌రిది?... స‌మాధానం చెప్పిన 'టైమ్‌' పత్రిక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేగ‌జైన్ ముఖ‌చిత్రంలో ఉన్న ఆ చేయి ఎవ‌రిది?... స‌మాధానం చెప్పిన 'టైమ్‌' పత్రిక!

  • ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా నిలిచిన #MeToo ఉద్య‌మ‌కారులు
  • 'మౌనాన్ని ఛేదించిన వారు'గా ఐదుగురి ఫొటోలు
  • వారితో పాటు ఒక‌రి మోచేయిని ముద్రించిన టైమ్‌
2017 ఏడాదికి గాను ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా #MeToo ఉద్య‌మ మ‌హిళ‌ల‌ను గుర్తిస్తూ 'మౌనాన్ని ఛేదించిన వారు'గా కీర్తిస్తూ ప్ర‌ముఖ మేగ‌జైన్ టైమ్ ముఖ‌చిత్రంపై ఐదుగురు మ‌హిళ‌ల ఫొటోల‌ను ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే. అయితే వీరితో పాటు ఆ ఫొటోలో ఒక‌రి మోచేయి కూడా క‌నిపిస్తోంది. ఆ మోచేయి ఎవ‌రిది? అనే ప్ర‌శ్న ఇంట‌ర్నెట్లో వైర‌ల్‌గా మారింది.

దీనిపై టైమ్ మేగ‌జైన్ స్పందించింది. అది టెక్సాస్‌కు చెందిన ఓ యువతి చేయి అని పేర్కొంది. ఆమె కూడా లైంగిక వేధింపులకు గురైందని, కానీ వివ‌రాలు బ‌యటికొస్తే త‌న కుటుంబం ఇబ్బందులు ప‌డుతుందేమోన‌ని భ‌య‌ప‌డ‌టంతో పేరు, ముఖం తెలియ‌నీయ‌కుండా అలా ముద్రించిన‌ట్లు వెల్ల‌డించింది. ఆమె లాగే ఇంకా ఎంతో మంది మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెప్పుకోలేక వేద‌న అనుభ‌విస్తున్నార‌ని, వారంద‌రికీ ఆమె చేయి చిహ్నంగా నిలిచింద‌ని టైమ్ వివరణ ఇచ్చింది.
time
magazine
person of the year

More Telugu News