Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ సొంతంగా ఎప్పుడూ ఆస్తులు ప్రకటించలేదు: నారా లోకేశ్

  • జగన్ ఆస్తులను సీబీఐ, ఈడీలే ప్రకటిస్తున్నాయి
  • జగన్ తమ ఆస్తులు ప్రకటించిన తర్వాతే ఆరోపణలు చేయాలి
  • ఏపీ మంత్రి లోకేశ్
వైసీపీ అధినేత జగన్ సొంతంగా ఎప్పుడూ ఆస్తులు ప్రకటించలేదని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించిన సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, జగన్ ఆస్తులను సీబీఐ, ఈడీలు ప్రకటిస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్ సంస్థపై 17 కేసులు వేశారని, వాటిలో ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని అన్నారు.

జగన్ తమ ఆస్తులు ప్రకటించిన తర్వాతే ఆరోపణలు చేయాలని అన్నారు. ఏపీలో ప్రతిపక్షం అనేదే లేదని, తామే అధికారపక్షం, తామే ప్రతిపక్షం అని లోకేశ్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకూడదని జగన్ కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. ‘పోలవరం’ పునరావాసానికే రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని, పునరావాసానికే వ్యయం భారీగా పెరిగిందని చెప్పారు.
జగన్
నారా లోకేశ్

More Telugu News