సినీ ఇండస్ట్రీలో పెద్ద అబద్ధం ‘ 2 మినిట్స్’ అని చెప్పడం!: హీరో సుమంత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీ ఇండస్ట్రీలో పెద్ద అబద్ధం ‘ 2 మినిట్స్’ అని చెప్పడం!: హీరో సుమంత్

  • షూటింగ్ లో షాట్ కోసం వెయిట్ చేస్తుంటే ‘2 మినిట్స్’ అంటారు
  • రెండు నిమిషాలంటే అరగంట సమయమైనా పట్టొచ్చు
  • ఓ ఇంటర్వ్యూలో సుమంత్
సినీ ఇండస్ట్రీలో పెద్ద అబద్ధం ‘2 మినిట్స్’ అని చెప్పడమని హీరో సుమంత్ అన్నారు. ‘మీకు అందరూ కామన్ గా చెప్పే అబద్ధం ఏంటి?’ అని ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన్ని ప్రశ్నించగా, ‘సినిమా ఇండస్ట్రీలో ఒకటుంటుంది. ఏ షూటింగ్ లో నైనా షాట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ‘2 మినిట్స్ సార్, రెడీ అయిపోతుంది’ అని చెబుతుంటారు. 2 మినిట్స్ అంటే అరగంట అవొచ్చు..ఇంకెంత సమయమైనా పట్టొచ్చు. ‘2 మినిట్స్’ అనేది సినిమా ఇండస్ట్రీలో ఊతపదం అయిపోయింది. ఇది అబద్ధం అనే విషయం చెప్పే వారికి, వినేవారికీ కూడా తెలుసు! అయినప్పటికీ పట్టించుకోరు’ అని సుమంత్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
హీరో సుమంత్
సినీ ఇండస్ట్రీ

More Telugu News