గ్యాంగ్ స్టర్ గా చేయాలనుందంటోన్న విజయ్ దేవరకొండ

టాలీవుడ్ కి సంబంధించి యూత్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఆయన ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. 'ఎవడే సుబ్రహ్మణ్యం' .. 'పెళ్లి చూపులు' .. 'అర్జున్ రెడ్డి' .. ఇలా విభిన్నమైన పాత్రలను చేస్తూ విజయ్ దేవరకొండ నటుడిగా తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలోనే కాకుండా ఓ నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టేశాడు.

ఇంతవరకూ తాను చేసిన పాత్రలు తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చాయనీ, గ్యాంగ్ స్టర్ పాత్ర కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. తనకి గ్యాంగ్ స్టర్ పాత్రలంటే చాలా ఇష్టమనీ, అలాంటి పాత్రలను చేయాలనుందంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంపిక చేసుకుంటోన్న విజయ్ దేవరకొండ కోసం, ఆ తరహా కథలను ఎవరైనా రెడీ చేసి తీసుకువస్తారేమో చూడాలి మరి.   


More Telugu News