బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ చేతిని ప‌ట్టుకుని మెలితిప్పిన వ్య‌క్తి.. అరెస్ట్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ చేతిని ప‌ట్టుకుని మెలితిప్పిన వ్య‌క్తి.. అరెస్ట్‌!

  • ‘సంజయ్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ షూటింగ్‌లో ఘ‌ట‌న‌
  • న‌టుడు అర్జున్‌ కపూర్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వాల‌ని చూసిన వ్య‌క్తి
  • న‌టుడు ఒప్పుకోక‌పోవ‌డంతో దాడి
  • ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ జిల్లాలో కొన‌సాగుతోన్న షూటింగ్‌
బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్ త‌న కొత్త సినిమా ‘సంజయ్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ షూటింగ్‌లో ఉండ‌గా ఆయ‌న‌పై ఓ వ్య‌క్తి దాడి చేశాడు. ప్ర‌స్తుతం ఆ సినిమా షూటింగ్‌ ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ జిల్లాలో కొన‌సాగుతోంది. షూటింగ్ జ‌రుగుతుండ‌గా కమల్‌ కుమార్‌ అనే వ్యక్తి తాగి సెట్‌లోకి దూసుకొచ్చాడు. వ్యానిటీ వ్యాన్‌లో ఉన్న అర్జున్ క‌పూర్ వద్ద‌కు వెళ్లి క‌రచాల‌నం ఇవ్వాల‌ని కోరాడు. అయితే, అందుకు స‌ద‌రు న‌టుడు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఆయ‌న చేతిని ప‌ట్టుకుని మెలితిప్పి దాడి చేశాడు. అంత‌లో అక్క‌డకు చేసుకున్న సెక్యూరిటీ గార్డులు ఆ వ్య‌క్తిని ప‌ట్టుకుని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అత‌డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.    
arjun kapoor
sanjay aur pinky faraar
uthara khand

More Telugu News