విరాట్ - అనుష్క‌ల పెళ్లి వార్త అబ‌ద్ధం: అనుష్క శ‌ర్మ ప్ర‌తినిధి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విరాట్ - అనుష్క‌ల పెళ్లి వార్త అబ‌ద్ధం: అనుష్క శ‌ర్మ ప్ర‌తినిధి

  • డిసెంబ‌ర్ 12న పెళ్లి చేసుకుంటారంటూ వార్త‌లు
  • అవ‌న్నీ పుకార్ల‌ని కొట్టిపారేసిన అనుష్క ప్ర‌తినిధి
  • విరాట్ విశ్రాంతి కోర‌డంతో పేట్రేగిన గాసిప్ రాయుళ్లు
బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌, భార‌త జ‌ట్టు సార‌ధి విరాట్ కోహ్లీలు డిసెంబ‌ర్ 12న‌ ఇట‌లీలోని మిలాన్‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌నే వార్త నిన్న రాత్రి నుంచి మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. పెళ్లి త‌ర్వాత డిసెంబ‌ర్ 21న ముంబైలో రిసెప్ష‌న్ కూడా నిర్వ‌హించ‌బోతున్నార‌నేది ఈ వార్త‌ల సారాంశం. అయితే, ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, అవ‌న్నీ వ‌ట్టి పుకార్ల‌ని అనుష్క శ‌ర్మ ప్ర‌తినిధి మీడియాకు వెల్ల‌డించారు.

వివిధ టీవీ ఛాన‌ళ్ల‌లో, వెబ్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను ప్ర‌తినిధి ఖండించారు. వీరి పెళ్లికి సంబంధించి వార్త‌లు రావ‌డం, ఖండించ‌డం అక్టోబ‌ర్ నుంచి జ‌రుగుతూనే ఉంది. అయితే ఇటీవ‌ల విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవ‌డం గురించి మీడియా ముందు మ‌ళ్లీ ప్ర‌స్తావించ‌డంతో ఈసారి వ‌చ్చిన పుకారుకు మ‌రింత బ‌లం చేకూరింది.
Virat Kohli
Anushka Sharma
virushka
marriage
italy
milan

More Telugu News