'అజ్ఞాతవాసి' ఆడియో ఫంక్షన్ పై ఆసక్తిచూపని పవన్?

  • 'అజ్ఞాతవాసి' ఆడియో ఫంక్షన్ పై ఫ్యాన్స్ లో ఆసక్తి 
  • ఈ నెల 20వ తేదీన జరిపే ఛాన్స్ 
  • వేదికగా విజయవాడ లేదా గుంటూరు
పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'అజ్ఞాతవాసి' సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదలకి నెల రోజులు మాత్రమే సమయం వుంది. అయితే ఇంతవరకూ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురించిన విషయాలేవీ బయటికి రాలేదు.

ఆడియో ఫంక్షన్ అవసరం లేదనీ .. ఒకవేళ ఏర్పాటు చేసినా తాను రాకపోవచ్చని పవన్ చెప్పినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. రాజకీయాలతో పవన్ బిజీగా ఉండటం వలన, ఆయన రాకపోయినా ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ నెల 20వ తేదీన విజయవాడలోగానీ .. గుంటూరులోగాని ఆడియో ఫంక్షన్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని సమాచారం.          
Go Back to Shorts
pavan kalyan
keerthi suresh

More Telugu News