ఎస్వీ కృష్ణారెడ్డితో బాలకృష్ణ మూవీ .. వచ్చేనెలలో సెట్స్ పైకి?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎస్వీ కృష్ణారెడ్డితో బాలకృష్ణ మూవీ .. వచ్చేనెలలో సెట్స్ పైకి?

  • బాలకృష్ణకి కథ వినిపించిన ఎస్వీ కృష్ణారెడ్డి
  • ఫాంటసీ నేపథ్యంలో కొనసాగనున్న కథ 
  • గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన 'టాప్ హీరో'
బాలకృష్ణ తన స్పీడ్ ను ఎంత మాత్రం తగ్గించడం లేదు. ఒక సినిమా పూర్తికావడమే ఆలస్యం .. మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళుతున్నారు. అలాగే ఇప్పుడు 'జై సింహా' షూటింగ్ పూర్తికాగానే .. తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. నిజానికి ఆయన తదుపరి సినిమాగా ఎన్టీఆర్ బయోపిక్ ఉండనుంది. అయితే ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రావడానికి ఇంకా సమయం వుంది. ఈలోగా ఇంకో సినిమా చేయడానికి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. గతంలో బాలకృష్ణతో 'టాప్ హీరో' చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి. ఎన్నో కుటుంబ కథా చిత్రాలను అందించిన కృష్ణారెడ్డి .. ఇటీవల బాలకృష్ణకి ఒక ఫాంటసీ కథ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథ బాలకృష్ణకి నచ్చినట్టుగా కూడా చెప్పేసుకున్నారు .. అది నిజమేనని తెలుస్తోంది. జనవరిలో ఈ ప్రాజెక్టును లాంచ్ చేయనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు.     
balakrishna
krishna reddy

More Telugu News