ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ లాంటి వారికి త‌గిన స‌మ‌యంలో గుణపాఠం చెబుతా: ప‌వ‌న్ క‌ల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ లాంటి వారికి త‌గిన స‌మ‌యంలో గుణపాఠం చెబుతా: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • ప్ర‌జారాజ్యం పార్టీ కార్యాల‌యంలోనే ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ పార్టీని తిట్టాడు
  • పార్టీలో స్వేచ్ఛలేద‌ని అన్నాడు
  • ప్ర‌జారాజ్యం పార్టీ ఓట‌మి బాధ‌ను క‌లిగించింది
  • అందుకు కార‌ణ‌మైన ఏ ఒక్క‌రినీ మ‌ర్చిపోలేను
ప్ర‌జార్యాజ్యం పార్టీలో స్వేచ్ఛ‌లేద‌ని అప్ప‌ట్లో ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ అన్నార‌ని జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టిస్తోన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడుతూ... ప్ర‌జారాజ్యం పార్టీ కార్యాల‌యంలోనే ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ స‌ద‌రు పార్టీని తిట్టాడ‌ని, పార్టీలో స్వేచ్ఛలేద‌ని అన్నాడని అన్నారు. అంటే, ఆ పార్టీలో స్వేచ్ఛ ఉన్న‌ట్లా? లేదా? అని ప్ర‌శ్నించారు.

ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ లాంటి వారికి త‌గిన స‌మ‌యంలో గుణపాఠం చెబుతాన‌ని పేర్కొన్నారు. కాగా, రాజ‌కీయ ప్రక్రియ‌లో తాను పొర‌పాట్లు చేయ‌వ‌చ్చని, కానీ త‌ప్పు చేయ‌నని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ప్ర‌జారాజ్యం పార్టీ ఓట‌మి త‌న‌కు బాధ‌ను క‌లిగించింద‌ని అన్నారు. అందుకు కార‌ణ‌మైన ఏ ఒక్క‌రినీ తాను మ‌ర్చిపోలేన‌ని అన్నారు. నాయ‌కుల‌కు స‌హనం, విజ్ఞ‌త చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పారు
parakala prabhakar
Pawan Kalyan
Chiranjeevi

More Telugu News