Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంటెక్స్‌తో ఒప్పందం చేసుకున్న ఎయిర్‌టెల్‌... త్వ‌ర‌లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు

  • ఆక్వా ల‌య‌న్స్ ఎన్‌1, ఆక్వా ఏ4, ఆక్వా ఎస్‌3 పేరుతో మోడ‌ళ్లు
  • త‌క్కువ ధ‌ర‌కే స్మార్ట్‌ఫోన్‌
  • రూ. 1,649 నుంచి ధ‌ర‌ ప్రారంభం
టెలికాం దిగ్గ‌జం ఎయిర్‌టెల్‌, ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ కంపెనీ ఇంటెక్స్‌తో ఓ ఒప్పందం చేసుకుంది. దీని ప్ర‌కారం డేటా, వాయిస్ కాల్స్ ఆఫ‌ర్ల‌తో కూడిన మూడు స‌రికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ల‌ను అందుబాటు ధ‌ర‌కే అందించేందుకు ఇరు కంపెనీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఆక్వా ల‌య‌న్స్ ఎన్ 1, ఆక్వా ఏ4, ఆక్వా ఎస్‌3 పేరిట ఈ మోడ‌ళ్ల‌ను త‌యారు చేయ‌నున్నారు. నిజానికి వీటి ధ‌ర వ‌రుస‌గా రూ. 3,799, రూ. 4,999, రూ. 6,649. కానీ ఎయిర్‌టెల్ క్యాష్‌బ్యాక్‌తో క‌లిపి తీసుకుంటే కనిష్టంగా రూ. 1,649 ప‌డుతుంది.

ఈ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ వ‌ర్తించాలంటే వ‌రుస‌గా 36 నెల‌ల‌పాటు ఎయిర్‌టెల్‌లో రూ. 169తో రీచార్జీ చేసుకోవాలి. అప్పుడు మొద‌టి 18 నెల‌ల త‌ర్వాత రూ. 500 క్యాష్‌బ్యాక్‌, త‌ర్వాతి 18 నెల‌ల‌కు రూ. 1000 క్యాష్‌బ్యాక్ వ‌స్తుంది.
intex
airtel
smart phones
4g

More Telugu News