ప్రహ్లాదుడిగా నటించడమే నేను చేసుకున్న అదృష్టం .. ఆ ఛాన్స్ అలా వచ్చింది: రోజారమణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రహ్లాదుడిగా నటించడమే నేను చేసుకున్న అదృష్టం .. ఆ ఛాన్స్ అలా వచ్చింది: రోజారమణి

  • నాతో ఆడుకుంటోన్న పిల్లలను ఏవీఎం వ్యాన్ తీసుకెళ్లింది 
  • నేను ఏడిస్తే నన్ను మా నాన్న తీసుకెళ్లారు 
  • అక్కడ నాకు మేకప్ టెస్ట్ చేసి ఓకే చేశారు
రోజారమణి పేరు వినగానే ఆమె చిన్నప్పుడు చేసిన 'భక్త ప్రహ్లాద' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాతో బాలనటిగా ఆమెకి వచ్చిన పేరు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. తాజాగా తెలుగు పాప్యులర్ టీవీ ఇంటర్వ్యూలో రోజారమణి మాట్లాడుతూ ఆ ఛాన్స్ తనకి వచ్చిన తీరును గురించి ప్రస్తావించారు.

" ఓ రోజున ఏవీఎం స్టూడియో నుంచి ఒక వ్యాన్ వచ్చి నాతో ఆడుకుంటోన్న కొంతమంది పిల్లలను ఎక్కించుకుంది. 'భక్త ప్రహ్లాద' సినిమా కోసం వాళ్ల పేర్లు ఇవ్వడం జరిగిందనే విషయం నాకు తెలియక నేను వ్యాన్ ఎక్కితే, లిస్టులో నా పేరు లేదంటూ దింపేసి వెళ్లిపోయారు. నేను బాగా ఏడవడంతో స్టూడియో చూపించి తీసుకువద్దామని నాన్న నన్ను తీసుకెళ్లారు.

నన్ను కూడా ప్రహ్లాదుడి వేషం కోసమే తీసుకువచ్చారు అనుకుని, అక్కడి వాళ్లు మేకప్ టెస్ట్ చేశారు. నెల రోజుల పాటు ఆ ప్రాసెస్ జరిగిన తరువాత, ప్రహ్లాదుడి పాత్ర కోసం నన్ను ఎంపిక చేశారు. ఆ పాత్ర నాకు దక్కడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం" అని చెప్పుకొచ్చారు.    
roja ramani

More Telugu News