అల్లు అర్జున్ 'నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా' కోసం బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు అర్జున్ 'నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా' కోసం బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్‌

  • ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడుతున్న జాతీయ అవార్డు గ్ర‌హీత‌
  • క‌జ్రారే, ఆజా న‌చ్ లే పాట‌ల‌కు కొరియాగ్ర‌ఫీ చేసిన వైభ‌వి
  • ఒక పాట కోసం ప‌నిచేయ‌నున్న మ‌ర్చంట్‌
ప్ర‌స్తుతం అల్లు అర్జున్ న‌టిస్తున్న 'నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా' చిత్రంలో ఓ పాట కోసం చిత్ర‌నిర్మాత‌లు ప్ర‌ముఖ‌ బాలీవుడ్ మ‌హిళా కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్‌ను రంగంలోకి దింపిన‌ట్లు తెలుస్తోంది. 'హ‌మ్ దిల్ దే చుకే స‌న‌మ్‌' చిత్రంలోని 'ధోలీ తారో ఢోల్ భాజే' పాట‌కు నృత్యాలు స‌మ‌కూర్చినందుకు గాను వైభ‌వి మ‌ర్చంట్ జాతీయ అవార్డు అందుకున్నారు.

అలాగే దేశ‌వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన 'క‌జ్రారే', 'ఆజా న‌చ్ లే' పాట‌ల‌కు కూడా వైభ‌వి మ‌ర్చంట్ కొరియోగ్ర‌ఫ‌ర్. అల్లు అర్జున్ సినిమాతో ఆమె మొద‌టిసారిగా ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టబోతున్నారు. అలాగే ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్ర‌హీత రాజీవ్ ర‌వి సినిమాటోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Allu Arjun
na peru surya na illu india
vaibhavi marchant

More Telugu News