పోరాడుతున్న శ్రీలంక... సెంచరీతో ఆకట్టుకున్న డిసిల్వా!
- శ్రీలంక బ్యాట్స్ మేన్ ను ఇబ్బంది పెడుతున్న అశ్విన్, జడేజా
- సెంచరీతో రాణించిన డిసిల్వా
- 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసిన శ్రీలంక
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ చండీమాల్ అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న ధనుంజయ డిసిల్వాతో కలిసి శ్రీలంకను ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ నిలకడ ప్రదర్శించారు. ఈ క్రమంలో డిసిల్వా (110) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం అద్భుతమైన ఓవర్ తో విసిగించిన అశ్విన్, ఊరించే బంతితో చండీమాల్ (36) ను పెవిలియన్ కు పంపాడు. అనంతరం సిల్వా (24) జాగ్రత్తగా ఆడుతున్నాడు. దీంతో శ్రీలంక జట్టు 70 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.