ఢిల్లీ టెస్టు: భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్.. 246/5
- శ్రీలంక విజయలక్ష్యం 410 పరుగులు
- మొదటి ఇన్నింగ్స్లో భారత్ పరుగులు-536
- మొదటి ఇన్నింగ్స్లో శ్రీలంక పరుగులు-373
- రెండో ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీలు చేసిన ధావన్, కోహ్లీ, రోహిత్
రెండో ఇన్నింగ్స్లో మురళీ విజయ్ 7, శిఖర్ ధావన్ 67, రహానె 10, పుజారా 49, కోహ్లీ 50, రోహిత్ శర్మ 50 (నాటౌట్), రవీంద్ర జడేజా 4 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లక్మల్, గమేజ్, పెరెరా, ధనంజయ, శాందనక్ ఒక్కో వికెట్టు చొప్పున తీశారు. శ్రీలంక విజయలక్ష్యం 410 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.