దీపిక ప‌దుకునేని చంపుతామ‌ని హెచ్చ‌రిక‌లు చేయ‌డం భ‌యంక‌ర‌మైన‌ది: షాహిద్‌ కపూర్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దీపిక ప‌దుకునేని చంపుతామ‌ని హెచ్చ‌రిక‌లు చేయ‌డం భ‌యంక‌ర‌మైన‌ది: షాహిద్‌ కపూర్‌

  • రాజ్‌పుత్‌ల హెచ్చ‌రిక‌ల‌పై స్పందించిన షాహిద్‌
  • చంపుతామని చెప్పడంతో షాక్‌కు గుర‌య్యా
  • సినిమా చూడకముందే ఇటువంటి నిర్ణయాలా? 
  • ఈ మూవీని చూసిన త‌ర్వాతే మాట్లాడాలి
వివాదాల సుడి గుండంలో చిక్కుకున్న బాలీవుడ్ సినిమా 'ప‌ద్మావ‌తి' విడుద‌ల వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. రాజ్‌పుత్‌ మహారాణి పద్మిని పాత్ర‌లో దీపిక ప‌దుకునే న‌టించింద‌ని, త‌మ‌ మ‌నోభావాల‌ను దెబ్బ తీస్తున్నార‌ని రాజ్‌పుత్‌లు, హిందూ సంఘాలు ఆందోళ‌న తెలిపాయి. దీప‌క ప‌దుకునేని హత్య చేయాలని రాజ్‌పుత్ సేన‌లు పిలుపు కూడా ఇచ్చాయి. వారి బెదిరింపుల‌పై స్పందించిన‌ షాహిద్ క‌పూర్‌... దీప‌క ప‌దుకునేని చంపుతామని చెప్పడంతో తాను షాక్‌కు గురైనట్లు మీడియాకు చెప్పారు.

ఇలా హెచ్చ‌రిక‌లు చేయడం భయంకరమైనద‌ని, తాను ఇటువంటి బెదిరింపులను ఊహించలేదని వ్యాఖ్యానించారు. దీపిక ప‌దుకునేకి హాని తలపెడతామని చాలా మంది అంటున్నారని, అస‌లు ఈ సినిమా చూడకముందే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ప‌ద్మావ‌తి సినిమా చూసిన తర్వాతే దానిపై మాట్లాడాల‌ని తాను మొదటి నుంచి చెబుతున్నాన‌ని చెప్పారు. ఈ సినిమాను నిజ జీవిత సంఘ‌ట‌న‌ ఆధారంగా తీయలేదని చెప్పుకొచ్చారు.
shahid kapoor
padmavati
raj puth

More Telugu News