వైజయంతీ మూవీస్ బ్యానర్లో విజయ్ దేవరకొండ

'అర్జున్ రెడ్డి' సినిమా హిట్ తో విజయ్ దేవరకొండ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. దాంతో ఆయనకి వరుసబెట్టి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆయన ఒప్పుకున్నవే అరడజను వరకూ వున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్లో పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న విజయ్ దేవరకొండ, రాహుల్ అనే కొత్త దర్శకుడితోను ఓ సినిమా చేస్తున్నాడు.

ఇక నందినీ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. నందినీ రెడ్డి చెప్పిన కథ ఆయనకి బాగా నచ్చిందట. కొత్తదనంతో కూడుకున్న ఈ కథ తన క్రేజ్ ను మరింతగా పెంచుతుందనే నమ్మకంతో ఆయన వున్నట్టుగా తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. మార్చిలో సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండ ఈ బ్యానర్ పై 'ఎవడే సుబ్రమణ్యం' చేసిన సంగతి తెలిసిందే.     


More Telugu News