టైటిల్ ను .. రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న మెగా హీరో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టైటిల్ ను .. రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న మెగా హీరో!

  • వరుణ్ తేజ్ హీరోగా 'తొలిప్రేమ'
  • టైటిల్ పోస్టర్ రిలీజ్ 
  • కథానాయికగా రాశి ఖన్నా 
  • ఫిబ్రవరి 9వ తేదీన విడుదల      
'ఫిదా'తో మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ్ .. తన తదుపరి సినిమాను వెంకీ అట్లూరితో చేస్తున్నాడు. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి 'తొలిప్రేమ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా అదే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ, పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

 టైటిల్ లోగో చాలా సింపుల్ గాను .. ఆకర్షణీయంగాను వుంది. ఇక పోస్టర్ కలర్ ఫుల్ గా ఉంటూ .. యూత్ కు కనెక్ట్ అయ్యేలా వుంది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఈ పోస్టర్ ద్వారానే తెలియజేశారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో పవన్ చేసిన 'తొలిప్రేమ' ఆయన కెరియర్లో ప్రత్యేక స్థానంలో నిలిచింది. ఇక అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ కి ఈ టైటిల్ ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.        
varun tej
rasi khanna

More Telugu News