సరస్సు అడుగున 3000 ఏళ్ల నాటి కోట.. వెలుగులోకి తెచ్చిన పరిశోధకులు!
- టర్కీలోని వాన్ సరస్సులో అద్భుతం
- ఉరాటు నాగరికతకు చెందినదిగా గుర్తింపు
- ఫొటోలు పోస్ట్ చేసిన డైవర్ తహసిన్ సీలాన్
'సరస్సు అడుగున ఏదో ఉందని చాలా కాలం నుంచి పుకారు ఉంది. కానీ ఎవ్వరికీ ఏం కనిపించలేదు. కానీ గట్టి ప్రయత్నం చేయడంతో మాకు కనిపించింది' అని తహసిన్ సీలాన్ చెప్పారు. శతాబ్దాల తరబడి జలసమాధిలో ఉన్నప్పటికీ కోట గోడలు చెక్కు చెదరలేదని తహసిన్ పేర్కొన్నారు. వాన్ సరస్సు చుట్టుపక్కల ఎన్నో నాగరికతలు వెలిశాయని, సరస్సు అడుగున ఇంకా మరెన్నో మిస్టరీలు ఉండొచ్చని ఆయన అన్నారు.