అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పిజ్జా... వీడియో చూడండి
- ఇటాలియన్ వ్యోమగామి కోరిక మేరకు పంపిన నాసా
- ఆనందంగా ఆరగించిన వ్యోమగాములు
- పిజ్జా తింటూ ఫొటోలకు పోజులు
ఇటీవల ఓ లైవ్ మానిటరింగ్ సెషన్లో కూడా తాను పిజ్జాను బాగా మిస్ అవుతున్నానని పావులో చెప్పాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఇటీవల వెళ్లిన ఆహారం సరఫరాలో భాగంగా వారికి పిజ్జా తయారు చేసుకునే పదార్థాలను పంపింది.
ఇంకేం, వ్యోమగాముల ఆనందానికి అవధులు లేవు. డీహైడ్రేట్ ఆహారం తిని తిని చచ్చుబడిన నాలుకకు కొత్త రుచిని తగిలించారు. వారు పిజ్జా తయారు చేసుకుని, గాల్లో ఎగురుతున్న పిజ్జాలను తింటూ ఫొటోలకు పోజులిచ్చారు. అంతేకాదు.. వారి ఆనందాన్ని పంచుకుంటూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు.