నాతో యాక్ట్ చేయడం శోభన్ బాబుకి భయమని విన్నాను: జమున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాతో యాక్ట్ చేయడం శోభన్ బాబుకి భయమని విన్నాను: జమున

  •  శోభన్ బాబుతో 'తాసీల్దారు గారి అమ్మాయి' చేశాను 
  • అప్పటికే ఆయన చాలా సినిమాలు చేశాడు
  • కానీ ఈ సినిమా ఆయనను స్టార్ ను చేసింది 
  • ఆ తరువాత మేం కలిసి నటించలేదు  
రెండవ తరం కథానాయకులుగా చెప్పుకునే కృష్ణ .. శోభన్ బాబులలో, కృష్ణ సరసన చాలా సినిమాలు చేసిన జమున, శోభన్ బాబు సరసన మాత్రం ఎక్కువ సినిమాలు చేయలేదు. వాళ్ల కాంబినేషన్లో వచ్చిన 'తాసీల్దారు గారి అమ్మాయి' మాత్రం సూపర్ హిట్ అయింది. తాజాగా తెలుగు పాప్యులర్ టీవీతో జమున మాట్లాడుతూ, 'తాసీల్దారు గారి అమ్మాయి' సినిమాను గురించి ప్రస్తావించారు.

 " ఈ సినిమా తరువాత శోభన్ బాబు సరసన చేయలేదు. ఈ సినిమా నాటికే శోభన్ బాబు 100 సినిమాలు చేసినట్టుగా ఓ ఇంటర్వ్యూలో చూశాను. ఈ సినిమా హిట్ అయ్యాక ఆయన ర్యాంక్ మారిపోయింది. అంతకుముందు అన్ని సినిమాలు చేసినా సెకండ్ గ్రేడ్ హీరోగానే ఉండేవాడు. ఈ సినిమా హిట్ అయ్యాక టాప్ హీరోగా మారిపోయాడు. ఎన్టీఆర్ .. నాగేశ్వరరావు .. శోభన్ బాబు అని చెప్పుకునే స్థాయిలోకి వెళ్లిపోయాడు. కానీ ఆ తరువాత మేమిద్దరం కలిసి నటించలేదు. నాతో యాక్ట్ చేయడం ఆయనకి భయమని విన్నాను" అంటూ నవ్వేశారు.    
jamuna
sobhan babu

More Telugu News