ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య...ఉద్రిక్తత
- ఓయూలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి
- మానేరు హాస్టల్ రూం నెంబర్ 159లో ఆత్మహత్య
- సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల్ దౌలాపూర్ కు చెందిన మురళి
ఈ నేపథ్యంలో మానేరు హాస్టల్ కు విద్యార్థి సంఘాల నేతలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగ సమస్య కారణంగా ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని మృతికి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, మురళి మృతదేహాన్ని చూసేందుకు రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఓయూకు వెళ్లారు. దీంతో అక్కడ విద్యార్థులు భారీ ఎత్తున నినాదాలు చేశారు.