నా దగ్గర బాగా డబ్బులున్నాయనుకుంటారు.. ఇప్పటికీ వడ్డీకి అప్పులు తెస్తుంటాను!: మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి
- వైఎస్ హయాంలో 16 శాతం తక్కువకు కాంట్రాక్టు తీసుకున్నా
- దగ్గరుండి పనులు చేయిస్తా
- డబ్బుల్లేవు..ప్రజా ధనం ఉంది
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో తాను మాట్లాడే ప్రయత్నం చేశానని, అయితే ఆయన తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆయన చెప్పారు. టీడీపీలో తన చేరికను అందరూ ఆహ్వానించారని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం తాను ఎవరితోనైనా రాజీపడేందుకు సిద్ధమని గుర్నాథరెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి పోటీపై హామీ వచ్చినందునే పార్టీ మారానని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన తెలిపారు. బేషరతుగా తాను పార్టీ మారానని ఆయన వెల్లడించారు.