న్యాయపరమైన చిక్కులు రాకుండా కాపు రిజర్వేషన్లు ప్రకటించాం: నారాయణ
- పార్లమెంటులో కాపు రిజర్వేషన్ చట్టమైపోతుంది
- బీసీలకు ఎలాంటి ఇబ్బంది లేదు
- ఆర్.కృష్ణయ్యకు ఉన్న సమస్య ఏంటో అర్ధం కావడం లేదు
ఇప్పుడు దానిని పార్లమెంటుకు పంపుతామని, దీనిని చట్టం చేసేందుకు కేంద్రానికి సమయం కావాలి కనుక.. కేంద్రానికి కనీసం 8 నెలల సమయం ఇచ్చామని ఆయన తెలిపారు. అంతవరకు జీవో ఇచ్చైనా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. బీసీలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించడంపై ఆర్.కృష్ణయ్యకు ఉన్న సమస్య ఏంటో తనకు అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. ఈ రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే ఉంటాయని ఆయన తెలిపారు. మెజారిటీ కాపులు సీఎంను కలిసి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వక్కర్లేదని తెలిపారని ఆయన వెల్లడించారు. దీంతో ఈ రిజర్వేషన్లను రాజకీయాలకు వర్తింపజేయలేదని మంత్రి తెలిపారు.